జపాన్ కంపెనీ హైకావ తో ఎక్స్పర్ట్ ఏసీ సొల్యూషన్స్ ఒప్పందం
జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఎయిర్‌కండీషన్ తయారీ సంస్థ హైకావ అప్లయెన్సెస్‌తో తమ ఒప్పందం కుదుర్చుకున్నామని హైదరాబాద్‌కు చెందిన ఎక్స్పర్ట్ ఏసీ సొల్యూషన్స్ నేషనల్ ఎయిర్కాన్ ఎండీ షంషుద్దీన్ తెలిపారు. తాజ్దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తాము సూపర్ స్టాకిస్ట్‌లుగా సర్వీస్ ప్రొవైడర్లుగా ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నామన్నారు. జపాన్ హైకావాతో ఒప్పందం వల్ల మరింత నాణ్యమైన, మెరుగైన ఉత్పత్తులను అందజేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.






