Granules India :గ్రాన్యూల్స్ ఇండియా ఔషధానికి అమెరికాలో అనుమతి

దృష్టి కేంద్రీకరించలేకపోతున్న వ్యక్తులకు చేసే చికిత్సలో వినియోగించే లిస్‌డెగ్జామ్‌ఫెటమైన్ డిమెస్లేట్ క్యాప్సూల్స్‌ను అమెరికాలో విడుదల చేయడానికి గ్రాన్యూల్స్ ఇండియా (Granules India )కు అనుమతి లభించింది. 10 ఎంజీ నుంచి 70 ఎంజీ వరకు, వివిధ డోసుల్లో ఈ క్యాప్సూల్స్‌ను అమెరికాలో విక్రయించనున్నట్లు గ్రాన్యుల్స్ ఇండియా వెల్లడిరచింది. తకేడా(Takeda) ఫార్మాస్యూటికల్స్ యూఎస్‌ఏ(USA)కు చెందిన వైవ్యాన్స్ అనే బ్రాండుకు ఇది జరికల్ ఔషధం (Herbal medicine). ఈ మందుతో యూఎస్‌లో తమ ఔషధాల శ్రేణి మరింతగా విస్తరిస్తుందని గ్రాన్యూల్స్ ఇండియా పేర్కొంది.