టెస్లా ఎంట్రీకి లైన్ క్లియర్

టెస్లా సహా పలు అంతర్జాతీయ విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీలు భారత్‌లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం అయింది. ఈ కంపెనీలను ఆకర్షించేందుకు రూపొందించిన ఈవీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆధునిక సాంకేతికతతో కూడిన ఈవీల తయారీకి భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్ధడమే ఈ పాలసీ ముఖ్యోద్ధేశం. ఈ పాలసీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో భారత్ విశ్వ శక్తిగా అవతరించనుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ప్రపంచ కంపెనీలను భారత్‌కు ఆహ్వానిస్తున్నాం. దేశంలో ఈవీలు ప్రపంచానికి ఎగుమతి చేయాగలగాలి. తద్వారా ఈ రంగంలో మనం విశ్వ శక్తిగా ఎదగాలి. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ను సృష్టించగలదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.