కేంద్ర హెచ్చరిక.. ఆండ్రాయిడ్ వెర్షన్ లలో
ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్న వారికి కేంద్రం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఐఎన్) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్నొన్న సీఈఆర్టీ`ఐఎన్. వీటితో సైబర్ నేరగాళ్లు ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశముందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు తమ ప్రకటనలో వెల్లడించింది. ఫ్రేమ్‌వర్క్, ఆండ్రాయిడ్ రన్‌టైమ్, సిస్టమ్ కాంపోనెంట్, గూగూల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నెల్, ఆర్మ్ కాంపోనెంట్స్, క్వాల్కమ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్స్‌లో తప్పిదాల కారణంగా ఈ సమ్యలు వచ్చినట్లు తెలిపింది.






