ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చిన గూగుల్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ రిక్రూట్మెంట్ విభాగంలో వందలాది మందికి లేఆఫ్స్ ప్రకటించింది. ఈ సారి వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు సంస్థ పేర్కొంది. వీరిలో చాలా మంది గ్లోబల్ రిక్రూట్మెంట్ టీమ్ నుంచి ఉన్నట్లు వెల్లడించింది. కొత్తగా నియామకాలను కూడా తగ్గించినట్లు అల్ఫాబెట్ చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ ద్వారా లేఆఫ్స్ సమాచారాన్ని అందించినట్లు పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులకు లేఆఫ్స్ విధించిన అతిపెద్ద కంపెనీ అల్ఫాబెట్ కావడం గమనార్హం.






