అమెరికా చరిత్రలో ఇది రెండోసారి
అమెరికా ప్రభుత్వ పరపతి రేటింగ్‌కు ఫిచ్ రేటింగ్స్ కోత పెట్టింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఫెడరల్, రాష్ట్రాల స్థాయిలోనూ, స్థానిక ప్రభుత్వాల స్థాయిలోనూ రుణ భారం పెరగడంతో పాటు, పాలనా ప్రమాణాలు నిలకడగా తగ్గుతూ ఉండడం పెరిగిపోతున్న రాజకీయ విభజనలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఫిచ్ తేల్చి చెప్పింది. దాంతో ఇప్పటి వరకు ఏఏఏ ఉన్న రేటింగ్ ఏఏG స్థాయికి తగ్గింది. అయితే ఈ కొత్త రేటింగ్ కూడా పెట్టుబడి గ్రేడ్ రేటింగే అయినప్పటికీ ఆమెరికా ప్రభుత్వ రుణ సమీకరణ భారం అవుతుంది. ఒకపక్క రాజకీయ పున సమీకరణలు పెరుగుతుండగా మరో పక్క మితిమీరిన వ్యయాలు, పన్నుల భారంగా తరచుగా వాషింగ్టన్లో ఏర్పడుతున్న ప్రతిష్టంభనలు పన్ను చెల్లించపుదారులకే భారంగా పరిణమించాయని ఫిచ్ వ్యాఖ్యానించింది. అమెరికా చరిత్రలో ఇలా పరపతి రేటింగ్‌కు కోత్త పెట్టడం ఇది రెండోసారి.






