వడ్డీరేట్లను పెంచిన ఫెడ్
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 2001 తదుపరి 5.25-55 శాతానికి చేరాయి. వెరసి ఫండ్స్ రేట్లు 22 ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. వడ్డీ రేటును పావు శాతం పెంచేందుకు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఫెడ్ భవిష్యత్‌లోనూ వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇవ్వడం గమనార్హం. కాగా ధరల కట్టడికి 2022 మార్చి నుంచి వరుసగా 10 సమావేశాలలో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఫెడ్ గత సమావేశంలో తొలిసారి యథాతథ పాలసీ అమలుకు కట్టుబడిరది.






