ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు కీలక మార్పులకు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అందరూ ఊహించినట్టుగా ఈ టేకోవర్ ఫెయిల్ కావచ్చు కానీ సాధ్యమైనంతవరకు సక్సెస్‌ను ప్రయత్నిస్తున్నామనడం చర్చకు దారి తీసింది. అలాగే ఎక్కువగా సంపాదించాలనుకునే జర్నలిస్టులకు ఎక్స్‌లో ఆఫర్ అంటూ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ఎవరైతే స్వేచ్ఛగా ఆర్టికల్స్ రాయాలనుకుంటారో ఆ జర్నలిస్టులు డైరెక్ట్ ఎక్స్‌లో పబ్లిష్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అంటూ మస్క్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆయా ఆర్టికల్ చదివే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. యూజర్లు చదివే ఆర్టికల్ ని బట్టి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ సబ్ స్క్రిప్ట్ షిన్ చేసుకోకపోతే మరింత చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌లో షేర్ అయిన వార్తల ముఖ్యాంశాలను తొలగించాలని యోచిస్తున్నాడు. తద్వారా ట్వీట్ పరిణామాన్ని తగ్గించి, యూజర్ టైమ్‌లైన్‌లో మరిన్ని ట్వీట్లు సరిపోయేలా చేయడానికే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది.






