ఎలాన్ మస్క్ షాక్…ఇకపై ఎంతో కొంత
ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ట్విట్టర్ యూజర్లందరికీ గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయానికి తెరతీశారు. మస్క్ ఇప్పటికే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సేవను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్కు చందా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు త్వరలోనే ట్విట్టర్ ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిపారు. అయితే ఎంత ఫీజు వసూలు చేస్తారన్న దానిపై మాత్రం అయన స్పష్టతనివ్వలేదు.






