టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు భారీ షాక్
టెస్లా అధినేత ఎలాన్ మాస్క్‌కు భారీ షాక్ తగిలింది. టెస్లా కార్ల ధరల్ని తగ్గిస్తామంటూ మస్క్ ప్రకటించారు. అయితే ఆ నిర్ణయంతో టెస్లా షేర్ వ్యాల్యూ భారీగా క్షీణించింది. మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు (రూ.1.64 లక్షల కోట్లు) కోల్పోయారు. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ మొత్తం సంపద 234.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మస్క్ ప్రతీరోజు 530 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మస్క్ నెట్ వర్త్‌ను మొత్తంలో ఏడు సార్లు కోల్పోయారు. అయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు.






