Anil Ambani : అనిల్ అంబానీకి ఈడీ షాక్ .. 50 కంపెనీలపై

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani )కి చెందిన కంపెనీలు రూ.3,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఈ కంపెనీలు తీసుకున్న మరిన్ని బ్యాంకు రుణాలనూ ఈడీ పరిశీలిస్తోంది. బయటకు వెల్లడిరచని కొన్ని విదేశీ ఆస్తులూ సంస్థ ఆధీనంలో ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబయి (Mumbai) లోని 35 ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ (Yes Bank) ఇచ్చిన రూ.3,000 కోట్ల రుణాలు చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారిమళ్లాయన్న ఆరోపణలపై ఈడీ (ED) ఢల్లీికి చెందిన దర్యాప్తు యూనిట్ దర్యాప్తు చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపారు.