వైద్యులకు కేంద్రం షాక్.. అవసరమైతే వారి లైసెన్సును
వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ ఔషధాల నే రాయాలని కేంద్రం ఆదేశించింది. లేదంటే డాక్టర్ల పై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లైసెన్సును కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ పేరుతో జారీ చేసిన కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. కాగా, 2002లో భారత వైద్య మండలి(ఐఎంసీ) జారీ చేసిన నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి వైద్యుడు జనరిక్ మందుల నే ప్రిస్క్రైబ్ చేయాలనే సూచనలు ఉన్నప్పటికీ, దీనికి భిన్నంగా వ్యవహరించే వైద్యులపై ఎలాంటి చర్యలను అందులో పేర్కొనలేదు. తాజాగా ఆ నిబంధనల స్థానంలో ఎన్ఎంసీఆర్ఎంపీ నియమావళి-2023 అమల్లోకి తెచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) వెల్లడించింది. ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై చర్యలను కూడా పేర్కొన్నారు.






