ఉద్యోగులకు డెల్ షాక్…
సేల్స్ టీమ్స్‌కు చెందిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు డెల్ వెల్లడించింది. భాగస్వాములతో కలిసి మార్కెట్లోకి వెళ్లే వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలో సేల్స్ టీం ఉద్యోగులపై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్రతినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగులకు సాయం అందించేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోందని తెలిపారు. సేల్స్ టీంలోని కొందరు సభ్యులు కంపెనీవి వీడతారని, ఇది కఠిన నిర్ణయమే అయినా వారు తమ తదుపరి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాము మద్దతు అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6650 మంది ఉద్యోగులను తొలగిస్తామని కంపెనీ చేసిన ప్రకటనలో ఈ ఉద్యోగులు ఉన్నారా లేక వీరు అదనమా అనేది తెలియరాలేదు. సేల్స్ టీముల్లో ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.






