Deepseek :అమెరికా కంపెనీలకు డిప్‌సిక్ సవాల్

చైనాకు చెందిన డీప్‌సీక్ (Deepseek) స్టార్టప్ సంస్థ ఏఐలో సంచలనం సృష్టిస్తోంది. తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ ఏఐ (AI) మోడల్ అమెరికా కంపెనీల (American companies)కు సవాలు విసురుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) లో చాట్ జీపీటీ (Chat GPT )ఒకప్పటి సంచలనం. దీన్ని రూపొందించిన ఓపెన్‌ఏఐ సంస్థ అనతికాలంలోనే ప్రాచుర్యం పొందింది. తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఏఐ లోకి అడుగు పెట్టాయి. దీంతో ఈ రంగంలో అమెరికానే ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. ఈ రంగంలో పెద్దన్నకు తిరుగులేదని భావిస్తున్న వేళ, ఒక్కసారిగా తెరపైకి వచ్చింది డీప్‌సీక్. చైనా (China)కు చెందిన ఈ స్టార్టప్ సంస్థ, ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడమే కాకుండా అమెరికా టెక్ షేర్లను కుదిపేసింది.