హైదరాబాద్ లో డేటాలింక్ కేంద్రం
ఆరోగ్య సేవల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న డేటాలింక్ సంస్థ మాదాపూర్లోని సైబర్ గేట్వేలో దాదాపు 10,000 చ. అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 100 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేసే అవకాశం ఉన్నట్లు డేటాలింక్ సీఈవో ఆశీష్ కచ్రు తెలిపారు. ఇప్పటికే 87 మందిని నియమించుకున్నట్లు తెలిపారు. తమ అమెరికా కార్యకలాపాలకు హైదరాబాద్ కేంద్రం వెన్ను దన్నుగా మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిపుణులైన మానవ వనరుల లభ్యత, ఇతర సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు డేటాలింక్ సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీకర్ చిలకమర్రి వివరించారు.






