అమెరికా కంపెనీతో క్యురాటెక్ ఒప్పందం
సొరియాసిస్ సంబంధ వ్యాధులకు వాడే యుస్టెకినుమాబ్ బయోసిమిలర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి అమెరికా కంపెనీ బయోఫ్యాక్చురా ఇంక్‌తో క్యురాటెక్ బయోలాజిక్స్ ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. అరబిందో ఫార్మాకు క్యురాటెక్ అనుబంధ కంపెనీ. ప్రతిపాదిత బీఎఫ్ఐ-751 బయోసిమిలర్‌ను వాణిజ్యపరంగా అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడిరచింది. యూఎస్, ఈయూ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా వర్థమాన మార్కెట్లలో కూడా దీన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం బయోఫ్యాక్చురా ప్రపంచవ్యాప్తంగా మూడో దశ క్లినికల్ పరీక్షలకు సిద్ధమవుతోంది.






