అమెరికాలో ఓ పెద్దాయనకు జాక్ పాట్ … లాటరీలో ఏకంగా
అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ పెద్దాయనకు లాటరీలో ఏకంగా రూ.42 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఈ భారీ మొత్తం అందుకోగానే ఆయన ముందుగా తన కోసం ఓ వాటర్మెలన్, భార్య కోసం పూలు కొనుగోలు చేశాడు. కొలరాడో లాటరీ తెలిపిన వివరాల ప్రకారం మాంట్రోజ్కు చెందిన వాల్డిమర్ బడ్ టీ ( 77) కొలరాడో లొట్టోG జాక్‌పాట్ విన్నర్‌గా నిలిచి 5 మిలియన్ డాలర్లకు పైగా ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. రిటైరైన బడ్ హాలిడే ట్రిప్‌కు వెళ్లి వచ్చిన తర్వాత వెబ్సైట్లో తాను కొనుగోలు చేసిన టికెట్‌ను చెక్ చేయగా జాక్‌పాట్ తగలడంతో పొరపాటేమోనని కొద్దిసేపు తటపటాయించాడు. 77 ఏండ్ల బడ్కు ప్రయాణాలంటే విపరీతమైన ఆసక్తి. బడ్ భార్య ప్రతి ఏటా ఆరు నెలలు అరిజోనాలో మరో ఆరునెలులు కొలరాడోలో నివసిస్తుంటారు.
కొలరాడోలో ఉండగా తాను ప్రతినెలా కొలరాడో లొట్టోG ఆడతానని చెప్పుకొచ్చాడు. తన లక్కీనెంబర్స్తో లాటరీ టికెట్లను కొనే ఫార్ములాను అనుసరిస్తానని అన్నారు. జాక్‌పాట్ కొట్టిన టికెట్‌ను మాంట్రోజ్లోని హ్యాంగిల్ ట్రీ ట్రావెల్ ప్లాజాలో బడ్ కొనుగోలు చేశాడు. సింపుల్ లైఫ్‌ను లీడ్ చేసే బడ్ దంపతులు జాక్‌పాట్ డబ్బుతో ఏం చేయాలనేది ఇంకా ప్లాన్ చేసుకోలేదు. కొన్ని ఛారిటీలకు కొంత మొత్తం ఇస్తానని, ఈ డబ్బుతో తాను ఏం చేయాలో ఆలోచిస్తానని చెపుకొచ్చాడు.






