చైనాలో పిల్లలకు రోజుకు 2 గంటలే మొబైల్
కఠిన నియమాలను అమలు చేయడంలో చైనా ముందుంటుంది. తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఇలాంటి మరో చట్టాన్ని అమలు చేస్తోంది. ఇకపై మైనర్లు రోజుకు 2 గంటల కంటే ఎక్కువగా మొబైల్ వాడకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. మొబైల్ వాడకం వల్ల పిల్లలు పెడదోవ పడతున్నారనే ఉద్దేశంతో ఇలాంటి నిబంధన తీసుకొచ్చింది. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని భావించే యాప్ లు, వెబ్ సైట్లపై నియంత్రణ విధించింది. ప్రభావం చూపించని వాటిపై ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇప్పటికే ఇంటర్నెట్ బ్రౌజర్లలో యూత్ మోడ్ తీసుకొచ్చింది చైనా. ఈ ముసాయిదాపై సెప్టెంబర్ 2లోపు అభిప్రాయాలు వెల్లడించాలని ప్రజలను కోరింది చైనా ప్రభుత్వం.






