బైజూస్ లో మరోసారి భారీగా ఉద్వాసన
బైజూస్‌లో మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సంసిద్ధమవుతోంది. ఈసారి 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. బైజూస్ ఇండియాకు కొత్త సీఈఓ గా అర్జున్ బాధ్యతలు స్వీకరించారు. కంపెనీని గాడిలో పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా బైజూస్‌ను పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగానే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఈసారి తొలగించే ఉద్యోగుల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉంటారని భావిస్తున్నారు.






