అమెరికాలో అరబిందో ఫార్మా ఔషధానికి అనుమతి
టైప్-2 మధుమేహ వ్యాధికి చికిత్సలో వినియోగించే సక్సాగ్లిప్టిన్ 2.5 ఎంజీ, 5 ఎంజీ ట్యాబ్లెట్లను అమెరికాలో విక్రయించడానికి అరబిందో ఫార్మా తుది అనుమతి సంపాదించింది. ఆస్ట్రజెనేకాకు చెందిన ఆంగ్లిజా ట్యాబ్లెట్లకు ఇది బయోఈక్వలెంట్ ఔషదం. ఈ బయోఈక్వలెంట్ ఔషధానికి అమెరికాలో అనుమతి సంపాదించిన తొలి జనరిక్ కంపెనీ తామే కాబట్టి, అక్కడ 180 రోజుల ప్రత్యేక మార్కెటింగ్ హక్కులు లభిస్తాయని వివరించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన 12 నెలల కాలానికి అమెరికాలో ఆంగ్లిజా ట్యాబ్లెట్లు 101 మిలియన్ డాలర్ల (సుమారు రూ.830 కోట్ల) అమ్మకాలు నమోదు చేసినట్లు ఇక్వియా అనే సంస్థ వెల్లడిరచింది. ఈ ఔషధంతో కలిసి అమెరికాలో అరబిందో ఫార్మాకు చెందిన 439 ఔషధాలకు అనుమతి లభించినట్లు అవుతోంది.






