అమెరికాలో అరబిందో ఫార్మా ఔషధం
ప్లెరిగ్జాఫర్ ఇంజెక్షన్ (20 ఎంజీ/ ఎంఎల్)ను అమెరికాలో వచ్చే ఏడాది జులైలో విడుదల చేయడానికి అరబిందో ఫార్మా సిద్ధమవుతోంది. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న యూగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ ఈ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి సాంపాదించింది. జెంజైమ్ కార్పొరేషన్‌కు చెందిన మోజోబిల్ ఇంజెక్షన్ అనే ఆర్ఎల్డీ (రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్) కి ఇది బయోఈక్వలెంట్ ఔషధం. అమెరికాలో గత ఏడాది ఈ ఔషధం 210 మిలియన్ డాలర్ల మేర విక్రయమైంది. ఈ ఇంజెక్షన్‌ను మల్టిఫుల్ మైలోమా/ నాన్ హడ్కిన్స్ లింఫోమా వ్యాధులకు చికిత్సలో జీ`సీఎస్ఎఫ్ (గ్రాన్యులోనైట్`కాలనీ స్టిమ్యు లేటింగ్ ఫ్యాక్టర్)తో కలిసి వినియోగిస్తున్నారు.






