సింగపూర్ సంస్థతో అరబిందో ఒప్పందం
సింగపూర్‌కు చెందిన హిలీమాన్ లేబొరేటరీస్‌తో తమ అనుబంధ సంస్థ అరో వ్యాక్సిన్స్ ప్రై.వి. ఒక లైసెన్సు ఒప్పందాన్ని కుదుర్చుకుందని అరబిందో ఫార్మా వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా చిన్న పిల్లల కోసం ఒక పెంటావ్యాలెంట్ టీకా అభివృద్ధి, తయారీ, విక్రయాల విషయంలో ఇరు సంస్థలు సహకారం అందించుకోనున్నాయి. అభివృద్ధి, క్లినికల్ స్టడీ లక్ష్యాలను చేరుకున్నాక హిలీమాన్కు అరో వ్యాక్సిన్స్ చెల్లింపులు చేస్తుంది. అలాగే టీకాను విజయవంతంగా విక్రయాల నిమిత్తం అందుబాటులోకి తెచ్చాక రాయల్టీ పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది.






