ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతీ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్‌షిప్‌లను లాంచ్‌లపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్ అయింది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్‌ను తేదీని యాపిల్ లీక్ కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది. తాజా నివేదిక ప్రకారం సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న లీవ్ తీసుకోవద్దని కంపెనీ తన ఉద్యోగులను కోరినట్టు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 7 ఈవెంట్ బుధవారం జరిగినప్పటికీ, ఐఫోన్ ప్రకటనలతో ఎక్కువ భాగం మంగళవారాల్లోనే జరిగాయి. సెప్టెంబరు 13 బుధవారం నాడు వస్తుంది కాబట్టి, ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్ కూడా అప్పుడే ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.






