Kevan Parekh :యాపిల్ సీఎఫ్ఓగా కేవన్ పరేఖ్

అమెరికాకు చెందిన ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ (Apple) ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా భారత మూలాలున్న కేవన్ పరేఖ్(Kevan Parekh) బాధ్యతలు స్వీకరించారు. 2014 నుంచి యాపిల్ సీఎఫ్‌ఓగా ఉన్న లూకా మైస్రీ (Luke Maisri) స్థానంలో కేవన్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు. యాపిల్‌లో 11 ఏండ్ల ప్రస్థానంలో కెవన్ పలు హోదాలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన కంపెనీ ఫైనాన్షియల్ ఫ్లానింగ్, ఎనాలిసిస్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణ, పాలనా వ్యవహారాలతో పాటు, ఇన్వెస్టర్ సంబంధాలు, మార్కెట్ రీసెర్చ్ వంటి పలు విభాగాలకు కెవన్ పర్యవేక్షిస్తున్నారు. ఇక యాపిల్‌లో ఆయన తొలినాళ్లలో ప్రోడక్ట్ మార్కెటింగ్, ఇంటర్నెట్ సేల్స్, సర్వీస్, ఇంజనీరింగ్ టీమ్స్‌లో పనిచేశారు. మిచిగాన్ వర్సిటీ (University of Michigan ) లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ (MBA) చేశారు.