Minister Payyavula: ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ : మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ఆర్సలర్ మిట్టల్ (ArcelorMittal Company ) కంపెనీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ను నమ్మి రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) కీలక ప్రకటన చేశారు. వైసీపీ (YCP) ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర ప్రభుత్వం పథకాలను రివైండ్ చేశామని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థనే జగన్ ప్రభుత్వం చంపేసిందని మంత్రి ఆరోపించారు. ఏపీ పది లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. ప్రతి నిమిషానికి ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకుని పాలన చేయాల్సి వస్తోందని అన్నారు. ఏడు శాతం అప్పులు చేసి జీతాలు చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీకి ఆదాయం ఇచ్చేది కాంట్రాక్టర్లే అని చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలకే ఆర్థిక శాఖ పేమెంట్‌లు చెల్లిస్తుందనే అపవాదు ఉందని చెప్పారు. ప్రయారిటీ ప్రకారం అన్ని కంపెనీలకు బిల్లులు చెల్తిస్తామని ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే 25 ఏళ్ల ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోపిడీ దారులుగా చేసుకుందని విమర్శలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లో కాంట్రాక్టర్లను భాగస్వాములుగా చేస్తుందని అన్నారు. దీపావళి పండుగకు కొంత మంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.