Vande Bharat: హిందూపురంలో వందే భారత్ ఆగుతుంది : ఎంపీ పార్థసారథి
వందే భారత్ రైలు (Vande Bharat train) పది రోజుల్లోపు (Hindupur)లో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి (BK Parthasarathy) తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna,), తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు. పురంలో వందే భారత్ రైలును ఆపేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు. బళ్లారి నుంచి మడకశిర మీదుగా రైల్వే ట్రాక్ పనులు వేగంగా సాగుతాయని అన్నారు. చాకర్లపల్లి రైల్వే గేటువద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభం అవుతాయని, దీనికి రూ.29 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఏడాదిలోపే పనులు పూర్తవుతాయని అన్నారు. బాలకృష్ణ హిందూపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని, రూ.92 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు.






