అమెజాన్ కీలక నిర్ణయం…సెప్టెంబర్ 19 నుంచి
రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ల చెల్లింపులకు రూ.2,000 నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం గానీ లేదా మార్చుకునేందుకుగానీ సెప్టెంబరు 30 వరకు సమయం ఉన్న విషయం తెలిసిందే. రూ.2,000 నోట్ల ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది.






