అమెజాన్ లో మళ్లీ కలకలం… ఉద్యోగులపై
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మరో దశ లేఆఫ్స్‌కు తెరలేచింది. లేటెస్ట్గా అమెరికాలో అమెజాన్ ఫ్రెష్ గ్రాసరీ స్టోర్స్ ఉద్యోగులపై ఈ-కామర్స్ కంపెనీ వేటు వేసింది. ఆర్థిక మందగమనంతో పునర్వ్యవస్తీకరణ ప్రణాళికలో భాగంగా అమెజాన్ జూనియర్ లెవెన్స్లో వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తోంది. ఆన్లైన్ పేమెంట్స్‌ను ప్రోత్సహించే ప్రక్రియలో గ్రాసరీ స్టోర్ల ఆధునీకరణతో అమెజాన్ ఫ్రెష్ గ్రాసరీ స్టోర్స్‌లో క్యాషియర్ డెస్క్‌లు కనుమరుగయ్యాయి. అమెజాన్ ఫార్మసీ డివిజన్ సిబ్బంది తొలగింపు అనంతరం అమెజాన్ ఫ్రెష్ స్టోర్స్‌లో లేఆఫ్స్ కలకలం రేపాయి. అమెరికాలో 44 అమెజాన్ ఫ్రెష్ స్టోర్స్‌ను అమెజాన్ నిర్వహిస్తుండగా వీరిలో పలువురు తమ ఉద్యోగాలు కోల్పోయారని తెలిసింది. కొలువులు కోల్పోయిన వారు అమెజాన్‌లో ఇతర పోస్టులకు దరఖాస్తు చేయవచ్చని లేకుంటే పరిహార ప్యాకేజ్‌ను అంగీకరించాలని కంపెనీ కోరినట్టు తెలిసింది.






