అమెజాన్ కీలక నిర్ణయం.. ఆందోళనలో ఉద్యోగులు
ప్రముఖ ఈ`కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు చూసి చూనట్లుగా ఉన్న ఈ కామర్స్ దిగ్గజం ఇటీవల ఉద్యోగుల పని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్కు రావాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం గత ఏడాది నుంచి సంస్థ ఉద్యోగుల్ని తొలగించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మరి వారానికి ఎంత మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.






