బెస్ట్ షవర్మా ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకున్న అల్ తాజా
* హై బిజ్ ఫుడ్ అవార్డ్స్-2023లో భాగంగా పురస్కారాన్ని అందుకున్న అల్ తాజా ప్రతినిధులు
* ముఖ్య అతిథులుగా హాజరైన హీరోయిన్లు సురభి పురాణిక్, హెబ్బా పటేల్
రుచికరమైన, నోరూరించే షవర్మాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అల్ తాజా.. మరోసారి సత్తా చాటింది. హై బిజ్ ఫుడ్ అవార్డ్స్-2023లో బెస్ట్ షవర్మా ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుని శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నటీమణులు సురభి పురాణిక్, హెబ్బా పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా అల్ తాజా ప్రతినిధులు బెస్ట్ షవర్మా ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని స్వీకరించారు.
షవర్మా పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు అల్ తాజా. అత్యంత రుచికరమైన, అథెంటిక్ షవర్మాకు అసలైన చిరునామా కూడా ఇదే. నాణ్యతలో రాజీలేనితనం.. తయారీలో అపార అనుభవం.. ఇవన్నీ అల్ తాజాకు బెస్ట్ షవర్మా ఆఫ్ ది ఇయర్ అవార్డును తెచ్చి పెట్టాయి. హై బిజ్ టీవీతో పాటు యావత్ ప్రపంచం ఆ గొప్పదనాన్ని గుర్తించేలా చేశాయి.
హై బిజ్ ఫుడ్ అవార్డ్స్-2023కి ఎంపిక కావడం పట్ల అల్ తాజా యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఇదొక అద్భుతమైన గుర్తింపని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. “
అవార్డుకు ఎంపిక చేసిన హై బిజ్ కు, జడ్జీల ప్యానల్ కు కృతజ్ఞతలు. ఇలాంటి ప్రశంసలు మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతాయి. ఇండస్ట్రీలో అగ్రగామిగా మా స్థానాన్ని బలోపేతం చేస్తాయి” అని అల్ తాజా యాజమాన్యం పేర్కొంది. తమ సేవలు ఇలాగే కొనసాగించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.






