ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు
ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రారంభ టికెట్టు ధరను రూ.1,470గా నిర్ణయించిన సంస్థ, బిజినెస్ క్లాస్ టికెట్టు ధరను రూ.10,130గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూడా వర్తించనున్నదని పేర్కొంది. ఈ ఆదివారం అర్ధరాత్రి 11:59 నిమిషాల లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చునని కంపెనీ వర్గాలు సూచించారు. వచ్చే పండుగ సీజన్లో తక్కువకే విమాన ప్రయాణం చేయాలనుకునేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రిటర్ను బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు డబుల్ లాయల్టి బోనస్ పాయింట్లు కూడా పొందవచ్చునని తెలిపింది.






