Accordion Center : హైదరాబాద్ లో అకార్డియన్ సెంటర్

అమెరికాలోని న్యూయార్క్(New York) కేంద్రంగా అంతర్జాతీయంగా పలు ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలకు ఆర్థిక సేవలు అందించే అకార్డియన్ (accordion center )అనే సంస్థ హైదరాబాద్ (Hyderabad) లో 1,500 మంది పనిచేసేలా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం గత ఏడాది మే నెలలో కొనుగోలు చేసిన హైదరాబాద్ డేటా అనలిటిక్స్ కంపెనీ మెరిలిటీక్స్‌తో తన కార్యకలాపాలను అనుసంధానం చేసినట్టు తెలిపింది.