Prasad Kumar: ఎమ్మెల్యే అనర్హత విచారణకు షెడ్యూల్
                                    బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ (Prasad Kumar) షెడ్యూల్ ఇచ్చారు. ఈనెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ చేపట్టనున్నారు. తొలుత పిటిషనర్లు ఆ తర్వాత ప్రతివాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రోజుకు ఇద్దరిన చొప్పున విచారించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ (Dr. Sanjay) , పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy), తెల్లం వెంటకట్రావు, అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) పై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ జరగనుంది.







