Britain :యూకే సంస్థల సంచలన నిర్ణయం.. వారానికి నాలుగు రోజులే

పని గంటల పై భారత్ సహా అనేక దేశాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్ (Britain)కు చెందిన కొన్ని కంపెనీలు(Companies) ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి. పేరొందిన పలు ఛారిటీలు(Charities), మార్కెటింగ్(Marketing), టెక్నాలజీ (Technology) సంస్థలు సహా 200 కంపెనీలు ఈ విధానంలోకి మారినట్లు తెలిసింది. 4 డే వీక్ ఫౌండేషన్ చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైనట్లు తెలిసింది. తాజా పని విధానంతో ఈ కంపెనీల్లో పని చేస్తున్న 5 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. తొలుత ఈ వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని బ్రిటన్‌లో దాదాపు 30 మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ప్రెస్ రిలేషన్స్ సంస్థలు అమలు చేశాయి. ఆ తర్వాత 29 ఛారిటీలు, 24 టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలు, 22 మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ సంస్థలు కూడా ఇదేబాట పట్టినట్లు సర్వేలో వెల్లడైంది. అత్యధికంగా లండన్‌లో 59 కంపెనీలు ఈ నూతన పని విదానాన్ని అనుసరిస్తున్నాయి.