యాపిల్ కంప్యూటర్.. వేలంలో రూ.1.84 కోట్లు
అమెరికాలోని బోస్టన్‌లో యాపిల్ సంస్థ తొలినాళ్లలో రూపొందించిన వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటి ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ నిర్వహించిన వేలంలో రూ.1.84 కోట్లకు (2,23,000 డాలర్లకు) అమ్ముడుపోయింది. ఈ కంప్యూటర్‌పై యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ వాజ్నియాక్ సంతకం సైతం ఉండడం వివేషం. యాపిల్`1 కంప్యూటర్ను పూర్తిస్తాయిలో పనిచేసే స్థితికి పునరుద్ధరించామని, దీనికి కస్టమ్ కేస్‌తోపాటు, బిల్ట్ ఇన్ కీబోర్డును అమర్చినట్లు బోస్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ తెలిపింది.
1976, 1977ల్లో కాలిఫోర్నియా లాస్ ఆల్టోస్‌లోని స్టీవ్ జాబ్స్ గ్యారేజీలో ఇలాంటి కంప్యూటర్లను 200 వరకు తయారు చేశారు. అప్పట్లో దీనిని సుమారు రూ.55,000 (666 డాలర్లకు) విక్రయించారు. వాస్తవానికి యాపిల్-1 కంప్యూటర్ వేలంలో సుమారు రూ.1.65 కోట్లు (2,00,000 డాలర్లకు) పలుకుతుందని అంచనా వేశారు. దీనిపై 2017 లో బ్రియంట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్నియాక్ వాజ్ అని సంతకం చేశారు. వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి వివరాలను ఆయన అభ్యర్థన మేరకు సంస్థ ప్రకటించలేదు.






