White House: ఇదో కొత్తరకం దోపిడీ : హైట్‌హౌస్ హెచ్చరిక

యాపిల్(Apple), మెటా పై ఐరోపా సమాఖ్య వేసిన భారీ జరిమానాను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ (White House) తీవ్రంగా ఖండిరచింది. ఇదో కొత్తరకం దోపిడీ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటే సహించబోమని హెచ్చరించింది. అమెరికన్ కంపెనీలను ప్రత్యేకంగా లక్ష్యం చేసుకొని, బలహీనపరిచే, ఆవిష్కరణలను అణచివేసే, సెన్సార్‌షిప్‌ను అనుమతించే చర్యలను ప్రత్యక్ష ముప్పుగా పరిగణిస్తాం అని పేర్కొంది. యాపిల్, మోటా(Meta )పై ఐరోపా సమాఖ్య నియంత్రణ సంస్థలు భారీ జరిమానా విధించాయి. యాపిల్‌పై 500 మిలియన్ యూరోల ( దాదాపు రూ.5,500 కోట్లు) అపరాధ రుసుమును యూరోపియన్ కమిషన్ (European Commission) విధించింది. మెటా ప్లాట్‌ఫామ్స్‌పై 200 మిలియన్ యూరోల ( సుమారు రూ.2,000 కోట్లు) జరిమానా వేసింది. 60 రోజుల్లోగా యాపిల్, మెటా సంస్థలు యూరోపియన్ కమిషన్ నిర్ణయాలు అమలు చేయాలి. ఈ నేపథ్యంలో ఈయూ జరిమానా వైట్‌హౌస్ హెచ్చరికలు చోటుచేసుకున్నాయి.