OpenAI: ఓపెన్ఏఐ ఆఫర్ .. భారత్ లో ఉచితంగా
ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) ఇటీవల చాట్‌జీపీటీ గో (ChatGPT Go) పేరుతో భారత్ కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సేవలకు సంబంధించి దేశీయ యూజర్లకు తాజాగా ఆఫర్ ప్రకటించింది. వచ్చే నెల నుండి ఏడాది పాటు చాట్‌జీపీటీ గో ఉచితంగా అందించనున్నట్లు వెల్లడిరచింది. నవంబరు 4 నుంచి లిమిటెడ్ టైం ప్రమోషనల్ పీరియడ్ అందుబాటులోకి రానుంది. భారత్‌లోని (India) యూజర్లందరికీ చాట్‌జీపీటీ గో ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నాం. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే ఉన్న చాట్‌జీపీటీ గో సబ్స్క్రైబర్లకూ ఈ ఉచిత ఆఫర్ వర్తించనుంది అని ఓపెన్ఏఐ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.







