High Court: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత (Justice Subhendu Samanta) ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీర్జ్సింగ్ ఠాకుర్ (Justice Dhiraj Singh Thakur), జస్టిస్ సామంతతో ప్రమాణం చేయించారు. కార్యక్రమ ప్రారంభంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీసీ పార్థసారథి (YVSBC Parthasarathy), కోల్కతా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సుభేందు సామంత బదిలీకి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం జస్టిస్ సామంతతో సీజే ప్రమాణం చేయించారు.







