India: చైనాలో ఇన్ ఫ్లుయెన్సర్లకు న్యూరూల్స్.. మరి ఇండియా పరిస్థితి ఏంటి..?
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కు కత్తెర వేసేందుకు చైనా (China) పెద్ద ప్రణాళికే రచించింది. ఇన్ ఫ్లుయెన్సర్లకు క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. త్వరలోనే దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అయితే..ఈ భారాన్ని సైతం చైనా సోషల్ మీడియా దిగ్గజాలు వెబో లాంటి సంస్థలకు అప్పగించింది. ఇన్ ఫ్లుయెన్సర్లకు ఉన్న క్వాలిఫికేషన్, అర్హత లాంటి అంశాలను ఈ సంస్థలే ధృవీకరించాల్సి ఉంటుంది. ఇందులో ఏదైనా మిస్ లీడ్ జరిగితే సంస్థల సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో చైనాలో వెల్లువెత్తుతున్న ఫేక్ న్యూస్ కు కత్తెర పడుతుందన్న వాదన వినిపిస్తోంది. మరి ఇండియా సంగతేంటి..?
ఇండియాలో లక్షలాది మంది ఇన్ ఫ్లుయెన్సర్లు…. రోజు కోట్లాది న్యూస్ ఐటమ్స్ ఆన్ లైన్ లోప్రమోట్ చేస్తున్నారు. ఈ కంటెంట్ రోజూ కోట్లాదిమందికి చేరుతోంది. మరి ఇందులో నిజమెంత..? అబద్దమెంత..? దీనికి మాత్రం ప్రభుత్వాలు, నిపుణులు, అధికారుల దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఎవరికి వారు.. ఎలాంటి అర్హత లేకున్నా సరే .. పెద్ద నిపుణుల్లా లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. వారు చెప్పిందే నిజమన్న స్థాయిలో బిల్డప్, కవరింగ్ ఇచ్చేస్తున్నారు. దీంతో చాలా మంది అమాయకులు.. వారు చెప్పినదాన్ని ఆచరించేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు.
మరికొంతమంది అయితే ఇన్ ఫ్లుయెన్సర్ల ముసుగులో దేశ ద్రోహానికి సైతం పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవలే ఎన్ఐఏ, సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలు సైతం.. తమ విచారణలో ఇలాంటి స్పైలను గుర్తించాయి. వీరు ఇన్ ఫ్లుయెన్సర్ల ముసుగులో దేశ సమాచారాన్ని సైతం .. శతృదేశాల సంస్థలకు అమ్మేస్తున్నారు. ఆ డబ్బులతో జల్సా చేస్తున్నారు కూడా. మరి ఇలాంటి వారిని అరికట్టడమెలా..? దీనికి మనం కూడా అలాంటి కఠిన చట్టాలు పూర్తిస్థాయిలో తేవాల్సి ఉంది.
ఈ నిర్ణయాలపై ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఫేక్ న్యూస్ అరికట్టడంపై భారత ప్రభుత్వం సైతం అంతే గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సరైన సమాచారం.. ప్రజలకు చేరుతుంది. ఫలితంగా అమాయకులు మోసపోకుండా ఉంటారు. దీంతో ముఖ్యంగా ఫేక్ గాళ్లను నిలువరించే ఛాన్స్ ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది.







