Kishan Reddy :ప్రజలకు అండగా నిలిచేది బీజేపీనే : కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ బహిరంగంగా మద్దతిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే ఐటీ రంగానికి కేంద్రంగా అభివృద్ధి సాధించిన కొత్త నగరం కూడా పాతబస్తీలా మారిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో మజ్లిస్ (Majlis) అరాచకాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్ (Naveen Yadav) గెలుపొందినా వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ (Ticket) ఇవ్వబోరని, మజ్లిస్ గూటికి చేరి పోటీ చేస్తారని అన్నారు. ప్రజలకు అండగా నిలిచి, సంక్షేమానికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని తెలిపారు. ఎన్నికకు మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉందని, రాముడికి ఆంజనేయుడిలా పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధిస్తే కార్పొరేటర్ స్థానం కూడా ఇక్కడి నుంచి గెలవవచ్చన్నారు. మన ప్రాంతం అభివృద్ధి కావాలి, ప్రజలకు రక్షణగా నిలవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.







