KTR: ఓట్లు కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది : కేటీఆర్
రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు, నిన్న మొన్నటి వరకు గీతక్క, సీతక్క(Seethakka), సురేఖ్క (Surekhka) సంతోషంగా ఉన్నారని భావించా, సురేఖక్క సంతోషంగా లేరనే విషయం ఇటీవల వెల్లడైంది. కాంగ్రెస్‌కు ఓటేయాలనే ఉత్సాహం ఎవరిలోనూ లేదు, ఇందుకు యూసుఫ్‌గూడలో సినీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం (CM) సన్మాన సభే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అక్కడ మూడోవంతు కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మున్మూరు కాపు (Munmuru Kapu)ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో ఆహ నా పెళ్లంట సినిమా నడుస్తోంది. ఆరు గ్యారంటీల అమలు పరిస్థితి కోడిని చూపించే అదే చికెన్ బిర్యాని అనుకోవాలని అన్నట్లు ఉంది. రైతులు పండిరచిన ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మహిళలకు నెలకు రూ.2,500, ఆడబిడ్డలకు వివాహ సమయంలో తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది. ఓట్లు కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఓటుకు రూ.2 వేలు ఇస్తే, తీసుకుని ప్రభుత్వం మహిళలకు బాకీపడిన మిగతా 58 వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించండి అని అన్నారు.







