TCS: మెగా కాంట్రాక్ట్ కోల్పోవడంపై టీసీఎస్ స్పష్టత
భారత దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) తో సుదీర్ఘ కాలంగా ఉన్న ఒక బిలియన్ డాలర్ కాంట్రాక్ట్‌ను మార్క్స్ అండ్ స్పెన్సర్ కంపెనీ (Marks and Spencer Company) ముగించుకుంది. సైబర్ దాడుల (Cyber attacks) కు సంబంధించి టీసీఎస్ వైఫల్యాల వల్లే ఈ కాంట్రాక్టును ఎం అండ్ ఎంస్ కంపెనీ (M&Ms Company) పునరుద్ధరించలేదని తెలిసింది. దీనిపై టీసీఎస్ స్పందిస్తూ ..ఆ వార్తలను తోసిపుచ్చింది. అవన్నీ తప్పుడు కథనాలంటూ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.







