అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ కోతలు!
అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించబోతున్నట్లు ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి సంకేతాలు ఇచ్చారు. ఇటీవల జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీఓజీఈ)ని ఏర్పాటు చేశారు. దీనికి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను నామినేట్ చేశారు. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలో మర్ `ఏ`లగోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో వివేక్ మాట్లాడారు. వాషింగ్టన్ డీసీ బ్యూరోక్రసీలో ఎన్నికవని ఫెడరల్ బ్యూరోక్రాట్లలో చాలా మందిని తాను, ఎలాన్ మస్క్ పంపించేస్తామన్నారు. అత్యుత్తములకు ఉద్యోగాలు వస్తాయని, వారి రంగుతో సంబంధం ఉండదని తెలిపారు.






