Revanth Reddy: అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విశ్వకవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి స్మరణార్థం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జీవితంలో బడి ముఖమే చూడని సహజకవి అందెశ్రీ గారు రాసిన జయ జయహే తెలంగాణ గీతం ఈరోజు ప్రతి బడిలో రాష్ట్ర అధికారిక గీతంగా పాడుకోవడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజల గుండెల్లో ఉన్నప్పటికీ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు పదేండ్లు అధికారిక గీతం లేకుండా పోయిందని, ప్రజా పాలనలో ప్రజలు కోరుకున్న జయ జయహే తెలంగాణ గీతానికి అధికారిక హోదా ఇచ్చి, పాఠ్యాంశంగానూ చేర్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. వన్నె తరగని కోహినూర్ వజ్రం లాగే కవులు, కళాకారులలో అందెశ్రీ గారి కీర్తి అజరామరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.






