J.D. Vance : భారత్‌లో జె.డి. వాన్స్ దంపతుల పర్యటన!

అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ (J.D. Vance) , ఆయన సతీమణి ఉషా వాన్స్ తమ పిల్లలతో కలిసి ఈ నెల 21నుంచి భారత్ (India)లో పర్యటించనున్నారు. వారు శిమ్లా, హైదరాబాద్ (Hyderabad) , జైపుర్, ఢిల్లీలను సందర్శించే అవకాశాలున్నాయని వాషింగ్టన్ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (Prime Minister Modi) తో వాన్స్ భేటీ అవుతారని తెలిపాయి. మరోవైపు అమెరికా జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్ వాల్జ్ (Michael Walz) కూడా ఈ నెల 21 నుంచే భారత్‌లో పర్యటించనున్నారు. ఆయనది పూర్తిగా అధికారిక పర్యటన.