Randhir Jaiswal: ఆ ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం అలర్ట్

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కొందరు భారతీయులు రష్యా (Russia) సైన్యం తరపున పనిచేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ అంశంపై కేంద్రం దృష్టికిరాగా ఈ నియామకాలపై విదేశాంగశాఖ స్పందించింది. రష్యన్ ఆర్మీ ఆఫర్లు (Army offers) ప్రమాదకరమని హెచ్చరించింది. రష్యా సైన్యంలో భారతీయ పౌరుల (Indian citizens) ను నియమించుకున్నట్లు ఉన్న నివేదికలు మా దృష్టికి వచ్చాయి. రష్యా సైన్యంతో పనిచేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి గత ఏడాదిగా ప్రభుత్వం పలు సందర్భాల్లో హెచ్చరించింది. ఇదంతా ప్రమాదకర వ్యవహారం కాబట్టి, రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలని, అందులో చేరొద్దని మరోసారి సూచిస్తున్నాం. అక్కడ పనిచేస్తున్న వారిని కూడా వెనక్కి పంపించాలని కోరుతూ రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నాం. బాధిత కుటుంబాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) అప్రమత్తం చేశారు.