America : అమెరికాను విడిచి వెళ్లొద్దు

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో అమెరికా(America)లోని టెక్ ఉద్యోగుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్తే తిరిగి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున అమెరికా వెలుపల ప్రయాణాలు పెట్టుకోవద్దని వీసాదారులైన తమ ఉద్యోగులను అమెజాన్(Amazon), గూగుల్(Google), మైక్రోసాఫ్ట్(Microsoft), ఆపిల్(Apple) వంటి ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలు హెచ్చరించాయి. భారత్ (India) వస్తే, అమెరికాలోకి తిరిగి ప్రవేశాన్ని నిరాకరిస్తారనే భయంతో స్వదేశానికి వెళ్లే ఆలోచనను విరమించుకున్నామని భారత్‌కు చెందిన ఇద్దరు హెచ్-1బీ వీసాదారులు మీడియాకు తెలిపారు.