Donald Trump: అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఈ వారం ఇరాన్‌తో అమెరికా చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టెహ్రాన్ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు పంపారు. అణుఒప్పందం జరిగి తీరాల్సిందే. లేదంటే తీవ్ర పరిణామా లు ఎదుర్కోక తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu)తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ శనివారం టెహ్రాన్ (Tehran)తో ఉన్నత స్థాయి చర్చలు ఉంటాయి. ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే ఇరాన్ పెద్ద ప్రమాదంలో పడినట్లే. బీకర బాంబు దాడులు జరుగుతాయి. ఇరాన్(Iran) వద్ద అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదు అని యూఎస్ అధ్యక్షుడు వ్యాఖ్యానిం చారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ వెంటనే స్పందించింది. ఒమన్ వేదికగా అమెరికాలో చర్చలు ఉంటాయి. అయితే, ఈ చర్చలు పరోక్షమే. ఏదేమైనా మాపై దాడుల బెదిరింపులను ఖండిస్తున్నాం. ఎవరైనా కవ్వింపు చర్యలకు దిగితే కచ్చితంగా తిప్పకొడతాం. ప్రతిదాడులకు వెనకాడబోం అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అయతుల్లా (Ayatollah Khamenei) స్పష్టం చేశారు.