అక్రమ వలసలపై ఉక్కుపాదమే : ట్రంప్
అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి తీరుతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులందరినీ వెనక్కు పంపించడం ఖాయమని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శరవేగంగా సమీపిస్తున్న వేళ న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలంతా డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఆమెను అవమానిస్తూ హేళనగా మాట్లాడారు.






