ట్రంప్‌నకు శిక్ష విధించాలా? నిలిపివేయాలా?
శృంగార తార స్టార్మీ డానియెల్స్‌కు చెల్లించిన హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలినందున శిక్ష విధించాలా? లేకుంటే దానిని నిలిపివేయాలా అనే అంశంపై జడ్జి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైన బాధ్యతల నిర్వహణకు ఈ కేసు అవరోధం కాకుడదంటూ ఆయన తరపు న్యాయవాదులు జడ్జికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా మాజీ అధ్యక్షుడికి కేసుల నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ట్రంప్ న్యాయవాదులు న్యూయార్క్ జడ్జి వాన్ మెర్చన్కు తెలుపుతూ తీర్పును నిలిపివేయాలని లేదంటూ పూర్తిగా కొట్టివేయాలని కోరారు. తద్వారా రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కూడా నిర్ణయాన్ని వాయిదా వేసేందుకు అంగీకరించింది.






